భారతదేశం, ఏప్రిల్ 21 -- 14 ఏళ్ల టీనేజర్ ఐపీఎల్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆ అద్భుతాన్ని అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలో దిగాడు. ఈ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సు ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. దీంతో ప్రపంచ క్రికెట్ లో ఫోకస్ అయ్యాడు. ఈ క్రికెటర్ పై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.

క్రికెటర్ల పట్ల పాకిస్థాన్ వైఖరిపై ఆ టీమ్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఒకవేళ ఫస్ట్ బాల్ కే వైభవ్ సూర్యవంశీ ఔటై ఉంటే అప్పుడు అతణ్ని తరిమికొట్టమని పాక్ లో అనేవాళ్లని బాసిత్ పేర్కొన్నాడు.

''14 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీ.. తొలి బంతికే సిక్సర్ కొట్టిన తీరు సాధారణ విషయం కాదు. కానీ తొలి బంతిని సిక్స్ కొట్టే ప్రయత...