Ferozepur/New Delhi, ఏప్రిల్ 25 -- ఫిరోజ్ పూర్ సెక్టార్ లో అనుకోకుండా, పొరపాటున జీరో లైన్ దాటినందుకు సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ పూర్ణబ్ కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్ లు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ పై భారత్ దౌత్యపరమైన కఠిన చర్యలకు దిగిన రోజే ఈ ఘటన జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

''బీఎస్ఎఫ్ జవాను పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించడంతో అతడిని పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అతడిని సురక్షితంగా, త్వరగా తిరిగి వచ్చేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని బిఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ ఇన్స్పెక్టర్ జనరల్ అతుల్ ఫుల్జెలే తెలిపారు. బుధవారం సాయంత్రం, గురువార...