భారతదేశం, మే 10 -- అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్థాన్ కు 100 కోట్ల డాలర్లను తక్షణమే రుణంగా అందించేందుకు ఆమోదం తెలిపింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) ఏర్పాటు కింద పాకిస్తాన్ ఆర్థిక సంస్కరణల కార్యక్రమం ప్రారంభ సమీక్షను తమ ఎగ్జిక్యూటివ్ బోర్డు ముగించిందని వాషింగ్టన్ కు చెందిన ఐఎంఎఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కు సుమారు 1 బిలియన్ డాలర్ల (SDR 760 million) తక్షణమే రుణంగా అందుతాయి. ఈ ఒప్పందం కింద మొత్తం సుమారు 2.1 బిలియన్ డాలర్లు (SDR 1.52 billion) పాకిస్తాన్ కు రుణంగా అందుతుంది' అని ఐఎంఎఫ్ తెలిపింది. అదనంగా, రెజిలియన్స్ అండ్ సస్టెయినబిలిటీ ఫెసిలిటీ (RSF) కింద సుమారు 1.4 బిలియన్ డాలర్లు ఇవ్వాలన్న పాకిస్తాన్ అధికారుల అభ్యర్థనను ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది.

పాకిస్తాన్ 37 నెలల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెస...