Hyderabad, మే 11 -- నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా హిట్ ది థర్డ్ కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మూవీ మే 1న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో హిట్ 3 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సక్సెస్ మీట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సక్సెస్ సెలబ్రేషన్ గురించి డిస్కస్ వచ్చినప్పుడు దేశంలో పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా సెలబ్రేషన్స్ చేయొచ్చా అనే చర్చ వచ్చింది. శత్రువులు మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. దానికి మన దేశం, సైన్యం చాలా హుందాగా బదులు చెప్పింది" అని అన్నాడు.

"వాళ్లు (పాకిస్తాన్) చేసిన పని వల్ల ఇండియాలో ఒకచోట సక్సెస్ సెలబ్రేషన్ క్యా...