భారతదేశం, జూన్ 26 -- భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా పర్యటనలో ఉన్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నారు. చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సు జరిగింది. భారత్, చైనా, పాకిస్థాన్‌తోపాటుగా పది సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. ఆ తర్వాత జాయింట్ డాక్యుమెంట్ సిద్ధం చేయగా.. అందులో పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావన లేదు. దీంతో ఆ పత్రంపై రాజ్‌నాథ్ సింగ్ సంతకం చేయలేదు.

పత్రాల్లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించలేదు. ఇది 26 మంది ప్రాణాలను బలిగొంది. ఆ పత్రంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించకపోయినా.. బలూచిస్తాన్‌ను చేర్చారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని అధికారిక వర్గాల సమాచారం...