భారతదేశం, ఏప్రిల్ 23 -- మినీ స్విట్జర్లాండ్'గా పిలిచే పహల్గామ్ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సుందరమైన బైసరన్‌లో ఉగ్రాదాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, మరో ఇద్దరు స్థానికులు, ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. దాడిలో మరణించిన వారి మృతదేహాలను బుధవారం శ్రీనగర్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఈ ఉగ్రదాడికి సంబంధించి అనుమానితుల స్కెచ్‌లు విడుదల చేశారు.

ఉగ్రవాదులు జమ్మూలోని కిష్త్వార్ నుంచి దక్షిణ కశ్మీర్లోని కోకర్నాగ్ మీదుగా బైసరన్‌కు చేరుకుని లోయలోని పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. అత్యంత ఘోరమైన దాడికి పాల్పడ్డారని అధికారులు అంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ఈటీ) షాడో సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది.

ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్...