భారతదేశం, మే 2 -- ప్రముఖ తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండ గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ కు చెందిన లాల్ చౌహాన్ అనే న్యాయవాది హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడి వందల సంవత్సరాల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను పోలి ఉన్నాయని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారని తన ఫిర్యాదులో చౌహాన్ ఆరోపించారు.

రెట్రో సినిమా కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడి వందల ఏళ్ల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను తలపించేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్ వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని, వెంటనే...