Hyderabad, మే 1 -- నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ తెలుగు వయోలెంట్ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3. డాక్టర్ అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ది థర్డ్ కేస్ మూవీలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటి శ్రీనిధి శెట్టి చేసింది. ఇవాళ (మే 1) థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా హిట్ 3 మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో హీరో నాని హిట్ 3 విశేషాలు పంచుకున్నారు.

-బ్రహ్మాండంగా ఉంది. షూటింగ్ కోసం అలాగే ప్రమోషన్స్ కోసం దేశ మొత్తం తిరిగాం. ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఆడియన్స్ సినిమాని చూడాలని ఫిక్స్ అయిపోయారు. సినిమా రాకముందే అలాంటి ఒక పాజిటివ్ వైబ్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

-హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. హిట్ 3 వచ్చేసరికి యాక్షన్ వయోలెన్స్ కథ డిమాండ్‌ని బట్...