భారతదేశం, ఏప్రిల్ 25 -- జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర దాడితో ప్రపంచం ఉలిక్కిపడింది. 26 మంది అమాయిలకు పొట్టనబొట్టుకున్న ఈ టెర్రిరిస్ట్ ఎటాక్ ను ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించింది. కొండలు, లోయలు.. ఇలా ప్ర‌కృతి అందాలతో ఆ ప్రదేశం పర్యాటకులను కట్టిపడేస్తుంటుంది. అలాంటి చోట రక్తపాతం జరిగింది. ఎవరూ ఊహించని మారణ హోమం ఇది. దీనిపై సెలబ్రిటీలు కూడా రియాక్టయ్యారు. ముఖ్యంగా నాని చేసిన పోస్టు వైరల్ గా మారింది. దీని వెనుక ఓ కారణముంది.

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'హిట్ 3' షూటింగ్ తాజాగా పహల్గాంలో జరిగింది. మూడు నెలల క్రితం ఆ మూవీకి చెందిన 200 మంది యూనిట్ దాదాపు 20 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిగింది. అలాంటి చోట కొన్ని రోజుల వ్యవధిలోనే ఉగ్ర దాడి జరగడంతో నాని షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.

''మూడు నెలల క్రితం మేం అక్కడున్నాం. 200 ...