భారతదేశం, డిసెంబర్ 3 -- తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ కంటే కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న హీరోలు, కొత్త దర్శకులు కూడా ధైర్యంగా డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్‌ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే 'పైసావాలా'.

పైసావాలా సినిమా టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రలు పోషించారు. పైసావాలా చిత్రానికి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహించారు.

ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్స్‌పై పైసావాల సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్...