భారతదేశం, ఫిబ్రవరి 17 -- మంగళవారం ఉదయం భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పుంజుకోవడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

గత సెషన్‌లో బంగారం ధర రూ. 1,54,760 వద్ద, వెండి ధర రూ. 2,39,891 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

1. బలపడిన డాలర్: డాలర్ ఇండెక్స్ 2% పెరిగి 97.15 వద్దకు చేరింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు, ఇతర కరెన్సీలు వాడే దేశాలకు బంగారం కొనుగోలు భారంగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు క్షిణిస్తాయి.

2. చైనా మార్కెట్లు మూతపడటం: చాంద్రమాన నూతన సంవత్సరం (Lunar New Year) సెలవుల కారణంగా ఈ వారం చైనా మార్కెట్లు మూతపడ్డాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గి, ధరల పెరుగుదలకు బ్రేక్ పడింద...