భారతదేశం, ఏప్రిల్ 16 -- Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపైకి అదుపు తప్పిన వాహనం దూసుకు వెళ్లడంతో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బొలెరో వాహనం అదుపు తప్పి ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. మొగల్తూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మార్గంలో అక్వా ఉత్పత్తులను తరలించే బొలెరో వాహనం అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకుపోయింది. పంట బోదెలో నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించేందుకు ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. వేగంగా దూసుకు వచ్చిన బొలెరో వ్యాన్ కూలీలపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయ...