భారతదేశం, జూలై 23 -- రెట్రో మూవీ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య నుంచి పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ రాబోతోంది. 'కరుప్పు' (Karuppu) టైటిల్ తో ఈ సినిమా ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. బుధవారం (జులై 23) సూర్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి పవర్ ఫుల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ అందించింది. టీజర్ లో యాక్షన్ సీన్లు అదిరిపోయాయి.

''కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచుతే రుద్రుడై దిగివచ్చే దేవుడు'' అనే డైలాగ్ తో టీజర్ పవర్ ఫుల్ గా స్టార్ట్ అయింది. మరోసారి లాయర్ గెటప్ లో సూర్య అదిరిపోయారు. ''నా పేరు సూర్య. నాకు ఇంకో పేరుంది'' అంటూ కోపం చూపించారు.

మరోవైపు గ్రామ పెద్దగా కత్తి చేతిలో పట్టుకుని ఫుల్ మాస్ అవతార్ లో డిఫరెంట్ షేడ్ లో కనిపించారు సూర్య. బ్య...