భారతదేశం, నవంబర్ 23 -- షావోమీ సంస్థకు చెందిన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షావోమీ 17 ప్రో మ్యాక్స్​ 2026 ప్రారంభంలో ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ని హై-పెర్ఫార్మెన్స్, పెద్ద బ్యాటరీ, వినూత్న డిజైన్‌తో కూడిన 'శక్తివంతమైన, తెలివైన పరికరం'గా కంపెనీ అభివర్ణించింది. అగ్రశ్రేణి ఫీచర్లు, అత్యుత్తమ పనితీరు, ప్రీమియం అనుభవాన్ని కోరుకునే వినియోగదారుల కోసం ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్టు వివరించింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

భారతదేశంలో షావోమీ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్​ఫోన్​​ ధర సుమారు రూ. 73,999 నుంచి ప్రారంభమవుతుందని అంచనా. ఈ ధర 12 జీబీ ర్యామ్​ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు సంబంధించినది.

చైనాలో ధరలు: చైనాలో బేస్ మోడల్ (12 జీబీ + 512 జీబీ) ధర 5,999 యువాన్​గా ఉంది. ఇక 16 జీబీ ర్యామ్​, 1 టీబీ...