భారతదేశం, జూలై 15 -- నథింగ్​ సంస్థ తన కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ని ఇటీవలే ఇండియాలో లాంచ్​ చేసింది. దాని పేరు నథింగ్​ ఫోన్​ 3. రూ. 80వేల ధరలోపు సెగ్మెంట్​లో యాపిల్​ ఐఫోన్​ 16తో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

నథింగ్ ఫోన్ 3 దాని ప్రత్యేకమైన ట్రాన్స్​పరెంట్​ డిజైన్‌తో వస్తుంది. కెమెరా లెన్స్‌లు కొంచెం అసాధారణంగా అమర్చి ఉంటాయి. విభిన్న డిజైన్ ఉన్నప్పటికీ, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. వెనుక ప్యానెల్‌లో గ్లిఫ్ మ్యాట్రిక్స్, హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన గ్లిఫ్ బటన్ కూడా ఉన్నాయి. వాటర్​ అండ్​ డస్ట్​ నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ మన్నికను కూడా అందిస్తుంది.

మరోవైపు యాపిల్ ఐఫోన్ 16 గ్లాస్, అల్యూ...