భారతదేశం, డిసెంబర్ 3 -- కోనసీమ జిల్లాలోని పచ్చదనాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణకు చెందిన నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టీ కాంగ్రెస్ నేతలు అయితే ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలనే ఆడనివ్వమని హెచ్చరిస్తున్నారు. ఓవైపు మంత్రులు సీరియస్ అవుతుండగా. మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. ఆ తర్వాత రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పేరొందాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం కూడా వీటి పచ్చదనమ...