Hyderabad, జూలై 24 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ నటించిన తొలి చిత్రం హరి హర వీరమల్లు. దీంతో హరి హర వీరమల్లుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతటి భారీ అంచనాల నడుమ ఇవాళ (జూలై 24) థియేటర్లలో హరి హర వీరమల్లు విడుదలైంది.

కానీ, ఆ అంచనాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేదని తెలుస్తోంది. హరి హర వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్ ఈ వారం ప్రారంభంలో ఆశాజనకంగా ప్రారంభమైంది. విడుదలకు కొన్ని గంటల ముందు ప్రారంభమైన ప్రీ-సేల్‌తో అంటే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇండియాలో రూ.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు దాటినట్లు సక్నిల్క్ తెలిపింది.

ఇండియాలో ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ దాదాపు రూ.30 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రం కేవలం నార్త్ అమెరికాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.16 కోట్లకు పైగా వస...