భారతదేశం, జూలై 29 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చే న్యూస్. రీసెంట్ గా ఆయన లేటెస్ట్ ఫిల్మ్ హరి హర వీరమల్లు థియేటర్లలో రిలీజైంది. జులై 24న ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమా మేనియాను ఎంజాయ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. వీళ్లకు మరింత కిక్ అందించే వార్త ఇది. పవన్ కల్యాణ్ రాబోయే సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (ustaad bhagat singh) క్లైమాక్స్ షూట్ ను పవన్ కంప్లీట్ చేశారు.

హరి హర వీరమల్లు మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. రికార్డులు తిరగరాస్తుందనుకున్న మూవీ కలెక్షన్లు పడిపోయాయి. మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ పై విమర్శలు వచ్చాయి. దీంతో కొన్ని సీన్లు కట్ చేసి, వీఎఫ్ఎక్స్ సీన్లు బెటర్ గా చేసి కొత్త వర్షన్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తర్వాతి సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్ భారీగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గ...