భారతదేశం, డిసెంబర్ 1 -- ఈ ఏడాది రెండు సినిమాల్లో కనిపించిన పవన్ కల్యాణ్ ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో మూవీతో రాబోతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. మూవీ టీమ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది.

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానుందంటూ సోమవారం (డిసెంబర్ 1) ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. అయితే దీనికి యాడ్ చేసిన వీడియో పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఇందులో పవర్ స్టార్ ఆ సాంగ్ లోని స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ బిహైండ్ ద సీన్స్ వీడియోను షేర్ చేశారు.

అందులో పవన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేయడం చూడొచ్చు. డైరెక్టర్ హరీష్ శంకర్ అతడు వేసిన స్టెప్పులు చూసి తెగ నవ్వడం, అది చూసి పవర్ స్టార్ కూడా పగల...