Hyderabad, సెప్టెంబర్ 1 -- డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి 2024 ప్రారంభంలో పవన్ కల్యాణ్‌తో చారిత్రాత్మక ఇతిహాస చిత్రం హరి హర వీరమల్లుకు దర్శకత్వం వహించారు. అయితే, పలు కారణాలతో క్రిష్ ఆ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత హరి హర వీరమల్లు సినిమాను నిర్మాత ఏఎం. రత్నం కుమారుడు, డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

అయితే, ఇటీవల హరి హర వీరమల్లు సినిమా థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరు దర్శకులుగా టైటిల్స్‌లో చూపించారు. అయితే, హరి హర వీరమల్లు సినిమా నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకోడానికి కారణం పవన్ కల్యాణ్ అనే వార్తలు గతంలో జోరుగా వచ్చాయి.

ఈ విషయంపై అసలు కారణాలు వెల్లడించారు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహించిన సినిమా ఘాటి. అనుష్క శెట్టి ప్రధాన ...