Hyderabad, జూలై 24 -- పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరి హర వీరమల్లు ఇవాళ (జూలై 24) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

ఇండియాలోని అనేక రాష్ట్రాల్లో హరి హర వీరమల్లు సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే, బెంగళూరులోని ఓ థియేటర్‌లోకి చొరబడిన కన్నడ కార్యకర్తలు హరి హర వీరమల్లు సినిమా పోస్టర్లను చింపేశారు. పవన్ కల్యాణ్ ఫొటోతో ఉన్న భారీ బ్యానర్‌ను కన్నడ కార్యకర్తలు పీకేశారు.

సభాస్థలిలో ప్రదర్శించిన ప్రచార సామగ్రిపై కన్నడ భాష లేకపోవడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేస్తూ కన్నడ భాష లేకపోవడం ఏంటీ అని ఆగ్రహించారు. అక్కడే ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులతో కన్నడ కార్యకర్తల...