భారతదేశం, డిసెంబర్ 9 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అదిరిపోయే స్టెప్పులేశాడు. అతడు నటిస్తున్న నెక్ట్స్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి దేఖ్‌లేంగే సాలా ఫస్ట్ సింగిల్ ప్రోమోను మంగళవారం (డిసెంబర్ 9) సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ స్టైలిష్ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ దేఖ్‌లేంగే సాలా డిసెంబర్ 13న రాబోతోంది. అయితే మంగళవారం (డిసెంబర్ 9) ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కేవలం 25 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో పవన్ వేసిన స్టైలిష్ స్టెప్పులు చూపించి ఈ పాటపై అంచనాలు పెంచేశారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాటను బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ పాడాడు. భాస్కరబట్ల పాట రాశాడు. పవన్ కల్యాణ్ బిగ్గెస్ట్...