భారతదేశం, సెప్టెంబర్ 2 -- పగ రగిలిన ఫైరూ.. ఇది పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ' నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ లోని ఓ లైన్. అవును.. అదే నిజం. పవన్ కల్యాణ్ కు సరిగ్గా సరిపోయే లైన్ ఇది. సినీ ఇండస్ట్రీలోనైనా, రాజకీయ జీవితంలోనైనా తనతో కాదు అన్నదాన్ని చేసి చూపించడమే పవన్ నైజం. ఇవాళ (సెప్టెంబర్ 2) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూద్దాం.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, తనకు ఎదురొస్తే ఎంతకైనా తెగించే వ్యక్తిగా పవన్ కల్యాణ్ అదరగొట్టిన మూవీ 'భీమ్లా నాయక్'. ఇందులో పవన్ కల్యాణ్ వర్సెస్ రానా పోరు ఫ్యాన్స్ తో విజిల్స్ కొట్టించింది. 2022లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.158 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా రెండు ఓటీటీల్లో ఉంది. ఆహాతో పాటు జియోహాట్‌స్టార్‌లో చూడొచ్చు...