భారతదేశం, జూన్ 28 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయల కాచేలా చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటికే హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ ను కూడా తీసుకు రాబోతున్నారు. ఫ్యాన్స్ లో హైప్ ను మరింత పెంచేందుకు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

హరిహర వీరమల్లును థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఈ జోష్ ను మరింత పెంచేలా హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. జులై 3న ఉదయం 11.10 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

హరిహర వీరమల్లు ట్...