భారతదేశం, మే 2 -- ఓ వైపు యాంకరింగ్ తో ఎంటర్ టైన్ చేస్తూనే మరోవైపు హీరోగా లక్ పరీక్షించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఆయన సెకండ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. పవన్ కల్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్ తో ప్రదీప్ ఈ మూవీ చేశాడు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను బాగానే నవ్వించింది. కానీ ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీ లో మే 8 నుంచి ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈటీవీ విన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీని ఒకప్పటి జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్, భరత్ కలిసి తెరకెక్కించ...