భారతదేశం, నవంబర్ 6 -- స్వాతంత్య్రంవచ్చిన తర్వాత మొదటిసారిగా విద్యుత్ కాంతులను చూసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రోంపల్లి గ్రామ పంచాయతీలోని గూడెం అనే మారుమూల గిరిజన కుగ్రామం. బుధవారం విద్యుత్ లైట్లతో మెరిసిపోయింది. ఈ కొండ ప్రాంతంలో నివసించే 17 కుటుంబాలు ఇన్ని రోజులు చీకటిలోనే ఉన్నారు. ఐదు నెలల క్రితం గ్రామస్తుల విజ్ఞప్తికి స్పందించి విద్యుదీకరణ ప్రాజెక్టును వేగవంతం అయ్యేలా చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

కేంద్ర ప్రభుత్వం నిధులు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి విద్యుత్ అధికారులు కొండపై ఉన్న గ్రామానికి విద్యుత్ లైన్లను తీసుకెళ్లారు. దాదాపు 9.6 కిలోమీటర్ల దూరం లైన్ వేస్తూ.. 217 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 17 ఇళ్లకు ఒక్కొక్కరికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్‌ను అందించింది. అనంతగిరి మండల ప్రధాన కార్య...