భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టు పెట్టిన యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్ రఘు అలియాస్‌ పుష్పరాజ్‌ను అరెస్టు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్‌ కుమార్‌ ప్రకటించారు. నిందితుడిని బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

అల్లు అర్జున్ ఫ్యాన్ అయిన రఘు హీరోల అభిమానుల సోషల్‌ మీడియా జరిన ఫ్యాన్ వార్ లో భాగంగానే మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేశారని ఎస్పీ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రఘును అరెస్టు చేశారు. ఓ మహిళపైనా రఘు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

'నిందితుడు రఘు 5...