భారతదేశం, డిసెంబర్ 19 -- ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల 'ఓజీ' (OG) దర్శకుడు సుజీత్‌కు రూ. 3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చాడు. అందరూ ఇది సినిమా హిట్ అయినందుకు ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. సినిమా షూటింగ్ కోసం సుజీత్ తన సొంత కారును అమ్మేస్తే, అది తెలుసుకున్న పవన్ తిరిగి అదే కారును కొనిచ్చాడు.

ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. యువ దర్శకుడు సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమా ఘనవిజయం సాధించిన ఆనందంలో పవన్ ఈ బహుమతి ఇచ్చారని అందరూ భావించారు. కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన, ఎమోషనల్ కారణం ఉంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఓజీ' షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు సుజీత్ ఒక కీలకమైన సీక్వెన్స్‌ను జపాన్ లో తీయ...