Hyderabad, సెప్టెంబర్ 24 -- మరికొన్ని గంటల్లో దే కాల్ హిమ్ ఓజీ మూవీ ప్రీమియర్ షో రానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ మేనియానే కనిపిస్తోంది. హరి హర వీరమల్లు దారుణంగా నిరాశ పరిచినా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అది అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మార్క్ రూ.75 కోట్లు దాటడం విశేషం.

పవన్ కల్యాణ్ ఓజీ మూవీ తొలి రోజు రూ.100 కోట్ల మార్క్ దాటడం ఖాయమేనని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.75 కోట్లు రావడంతో పవన్ కెరీర్లో ఇప్పటికే అత్యధిక తొలి రోజు వసూళ్ల రికార్డు బ్రేకయినట్లే. బుధవారం (సెప్టెంబర్ 24) రాత్రి ప్రీమియర్ షోలు, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కలిపి రూ.75 కోట్లు దాటాయి. ఓవర్సీస్ లో 3.3 మిలియన్ల డాలర్లు కాగా.. ఒక్క నార్త్ అమెరికాలోనే ఇవి 2.3 మిలియన్ డాలర్లుగా ...