Hyderabad, జూలై 18 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ టాలీవుడ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సినిమా హరి హర వీరమల్లు. ఎఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ చేసింది. బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశాడు.

జూలై 24న హరి హర వీరమల్లు మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు సినిమా, పవన్ కల్యాణ్, తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది.

-హరి హర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి.

-పవన్ కల్యాణ్ గారికి, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. అలాగే నా పాత్ర కనిపించే ప...