భారతదేశం, డిసెంబర్ 7 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతోత్సవ్ ముగింపు కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ.. పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదును ప్రదానం చేశారు.

పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో మంగళూరు చేరుకుని రోడ్డు మార్గంలో ఉడుపి చేరుకున్నారు. గీతోత్సవ్ కార్యక్రమం ఒక నెల క్రితం ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గీతోత్సవ్ ముగింపు కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. భోజనం తర్వాత, ఆయన శ్రీ కృష్ణ మఠానికి వెళ్లి దర్శనం చేసుకుని, స్వామీజీని కలిసి మాట్లాడారు. తరువాత జరిగిన గీతోత్సవ్ ముగింపు కార్యక...