భారతదేశం, అక్టోబర్ 27 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కామనర్స్, సెలబ్రిటీలు అంటూ జోరుగా సాగుతోంది. ఇక గత వారం అంటే, బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. చిట్టి అలేఖ్య పికిల్స్ ద్వారా పాపులర్ అయిన రమ్య మోక్ష బిగ్ బాస్ హౌజ్‌లో సుమారు 15 రోజులు మాత్రమే ఉంది.

ఇక ఎలిమినేట్ అయిన వాళ్లతో హీరో, మాజీ కంటెస్టెంట్ శివాజీ హోస్ట్‌గా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ తెలుగు సీజన్ 9 ఉంటుందని తెలిసిందే. ఈ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య మోక్షకు హీరో శివాజీ తన ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టించినంత పని చేశాడు.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోకి రమ్య మోక్ష రాగానే చప్పట్లు కొట్టాడు శివాజీ. "సౌండ్ వచ్చిందా" అని శివాజీ అడిగితే "వచ్చింది సర్" అని రమ్య చెప్పింది. తర్వాత శివాజీ విజిల్ వేశాడు. "సౌండు ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ (హౌజ్‌లో) బాగా వినపడిందా" అని శ...