Telangana,hyderabad, సెప్టెంబర్ 27 -- తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జీవో ఇవ్వటంతో. ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం పలు విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఫలితంగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ముందుగా షెడ్యూల్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ముందుంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. షెడ్యూల్‌ విడుదలైతే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలున్నాయి. 5,982 మండల పరిషత్‌ ప్రాదేశిక నియో...