Hyderabad, జూన్ 5 -- ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న సరికొత్త తెలుగు సూపర్ నాచురల్ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. హీరోయిన్ రీతు వర్మ ఈ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా.. సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా చేశారు. సుబ్బరాజు కీలక పాత్ర పోషించాడు.

బి కిశోర్ దర్శకత్వం వహించిన ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌ను సుధాకర్ చాగంటి నిర్మించారు. జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 3న మీడియాకు రెండు ఎపిసోడ్స్‌ను ప్రదర్శించారు. దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవిక అండ్ డానీ నిర్మాత సుధాకర్ చాగంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత సుధాక‌ర్ చాగంటి మాట్లాడుతూ.. "దేవిక అండ్ డానీ వంటి సిరీస్‌తో మీ ముందుకు రానుండ‌టం ఎంతో ఆనందంగా ఉంద...