భారతదేశం, మే 13 -- పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొప్పాయిల లోడ్‌తో వెళుతున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. స్పాట్‌లోనే ముగ్గురు కార్మికులు చనిపోగా ఆస్పత్రిలో మరొకరు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి వాసులుగా గుర్తించారు.

పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసినట్టు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని...