భారతదేశం, మే 4 -- పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల సోదాల్లో పలు ఇళ్లలో భారీగా మారణాయుధాలు లభ్యమయ్యాయి. శిరిగిరిపాడులో వారం కిందట వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు దాడులకు సిద్ధమయ్యాని.. పోలీసులకు సమాచారం వచ్చింది. దాడుల కోసం గోతాలలో ఇరు వర్గాలు భారీగా ఆయుధాలు దాచినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. అనుమానం ఉన్న ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేయగా.. కత్తులు, గొడ్డళ్లు, బరిసెలు, ఇనుపరాడ్లు, రాళ్లు, కారం కలిపిన నీళ్లు లభ్యమయ్యాయి.

మాచర్ల నియోజకవర్గంలో గతంలో ఫ్యాక్షన్, రాజకీయ హత్యలు జరిగాయి. ఇక్కడ చాలా గ్రామాల్లో వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. నిత్యం అలర్ట్‌గా ఉంటూ.. గ్రామాల్లో శాంతిని నెలకొ...