భారతదేశం, డిసెంబర్ 22 -- పల్నాడు జిల్లా దుర్గి మండలం అగిగొప్పల గ్రామంలో ఘోరమైన ఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ముళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ఇద్దరూ ఓ పార్టీకి సానుభూతిపరులు. రాజకీయ కారణాలతోనే హత్య చేశారా? లేదంటే వేరే కారణాలతోనా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కొత్తా హనుమంతు, కొత్తా శ్రీరాంమూర్తి అనే ఇద్దరు అన్నదమ్ముళ్లను నరికి చంపారు. శ్రీరాంమూర్తిని అమ్మవాడి గుడి సమీపంలో చంపేశారు. హనుమంతును గ్రామం మధ్యలోనే అత్యంత కిరాతకంగా నరికారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ మెుదలుపెట్టారు. ఈ హత్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్య...