భారతదేశం, డిసెంబర్ 5 -- పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు ఇంజీనిరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

మేడగం రామిరెడ్డి, శివరాత్రి మహేశ్, మెరుపు శ్రీకాంత్, వంగవోలు వాసు, గొడవర్తి యశ్వంత్ సాయిని మృతులుగా గుర్తించారు. మరో ఇద్దరు, మద్దుకూరి కార్తీక్, చలపతిలకు తీవ్ర గాయాలయ్యాయి, వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు ఆయప్ప స్వామి మాల ధరించి ఉన్నారని. వారంతా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి...