భారతదేశం, మే 25 -- పల్నాడు ప్రాంతం మరోసారి ఉలిక్కిపడింది. వెల్దుర్తి మండలంలో ఆధిపత్య పోరు ఇద్దర్ని బలి తీసుకుంది. బోదిలవీడులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే అన్నదమ్ముల్దిద్దరిని కారుతో ఢీకొట్టి హతమార్చారు. అత్యంత సమస్యాత్మక గ్రామం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్యలు జరిగాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు హత్యలు ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది.

గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు.. తెలంగాణలోని నక్కలగూడెంకు ఓ శుభకార్యానికి వెళ్లారు. మొత్తం నాలుగు ద్విచక్ర వాహనాలపై 8 మంది వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని అందరూ గుండ్లపాడుకు బయలుదేరారు. అయితే.. మాచర్ల నుంచి గ్రామానికి వెళ్లే క్రమంలో రెండు బైక్‌లు కొంత ముందుగా వెళ్లాయి. ఆ తర్వాత జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటే...