భారతదేశం, జూలై 16 -- ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 19 ఏళ్ల కొడుకును హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టాడు. మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

తల్లి తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎర్రబాలెం గ్రామానికి చెందిన నిందితుడు వెంకటేశ్వర్లు నాయక్ పది రోజుల క్రితం తన మొదటి భార్యతో కలిగిన కుమారుడు భూక్య మంగ్యా నాయక్ (19)ను హత్య చేసి, కాలువ పక్కన మృతదేహాన్ని పాతిపెట్టాడు.

పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

"నిందితుడు వెంకటేశ్వర్లు తన మొదటి భార్య కోటేశ్వరి కుమారుడు మంగ్యా నాయక్ (19)ను హత్య చేసి, మృతదేహాన్ని వ్యవసాయ పొలంలో ...