భారతదేశం, ఆగస్టు 8 -- ఒకవేళ మీకు తిరగాలని అనిపిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మీరు ప్లాన్ ఆపేస్తారా? చాలా మంది భారతీయులు ఇప్పుడు అలా చేయడం లేదట. గత ఆరు నెలల్లో 27శాతం మంది ప్రయాణాల కోసం వ్యక్తిగత రుణం తీసుకున్నారని తాజా నివేదిక తెలిపింది. ప్రయాణాల కోసం రుణాలు తీసుకునే వారిలో 65 శాతం మంది ప్రైవేటు ఉద్యోగులు ముందంజలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వ్యాపారులు(17 శాతం) ఉన్నాయి. పైసాబజార్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

2023లో ప్రయాణాల కోసం లోన్ తీసుకునేవారి సంఖ్య 21 శాతం ఉండగా, ఇప్పుడు ఆరు శాతానికి పెరిగి 27 శాతం అయింది. పెద్ద నగరాల్లో ఢిల్లీ-హైదరాబాద్ ముందు వరుసలో ఉండగా, ఢిల్లీ వాసులు ఎక్కువ రుణాలు తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి 35 శాతం మంది ప్రయాణాల కోసం రుణాలు తీసుకున్నారు. 18 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ముంబై (15 శాతం), బెంగళూరు (14శాత...