భారతదేశం, డిసెంబర్ 20 -- మన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఉన్న సులభమైన మార్గాల్లో పర్సనల్​ లోన్​ ఒకటి. ప్రాథమిక అర్హతలు ఉంటే చాలు.. కొన్ని గంటల్లోనే నగదు మీ చేతికి అందుతుంది! కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తక్కువ సమయంలో లోన్ అప్రూవల్ కావాలంటే మీ ఆర్థిక ప్రొఫైల్ పక్కాగా ఉండాలి.

వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు లేదా విదేశీ విద్య వంటి అవసరాల కోసం మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే, మీ లోన్ అప్రూవల్ అవకాశాలను పెంచేందుకు ఆరు ముఖ్యమైన టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

1. క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోండి-

లోన్ రావడంలో 'క్రెడిట్​ స్కోర్' కీలక పాత్ర పోషిస్తుంది. మీ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు మీకు సులభంగా లోన్ ఇస్తాయి. క్రెడిట్ కార్డు బిల్లులు, పాత ఈఎంఐలను గడువులోగా చెల్లించడం ద్వారా మీ స్కోర్‌ను పెంచుకోవచ్చ...