భారతదేశం, ఆగస్టు 11 -- పర్సనల్​ లోన్​ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడం ద్వారా మీ అప్లికేషన్​కి ఆమోదం లభించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అంతేకాకుండా దీని ద్వారా మీరు తక్కువ వడ్డీ రేట్లతో రుణాన్ని సైతం పొందవచ్చు! సాధారణంగా, అప్పు ఇచ్చే సంస్థలు 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను మంచిదిగా పరిగణిస్తాయి. మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను సమర్థవంతంగా పెంచుకోవడానికి ఐదు సులభమైన మార్గాలను ఈ కింద తెలుసుకోండి..

మొదటిగా, ప్రధాన క్రెడిట్ బ్యూరోల నుంచి మీ క్రెడిట్ రిపోర్టును పొందండి. దేశంలో ప్రముఖ క్రెడిట్ బ్యూరోలు CIBIL, CRIF హై మార్క్, ఈక్విఫాక్స్ ఎక్స్‌పీరియన్. వీటి ద్వారా మీరు మీ క్రెడిట్ రిపోర్టును చూడవచ్చు. అందులో మీ వ్యక్తిగత వివరాలు, ఓపెన్ లోన్‌లు, మీకు సంబంధం లేని ఖాతాల వివరాలు లేదా తప్పుగా నమోదైన ఆలస్య చ...