భారతదేశం, ఆగస్టు 3 -- పర్సనల్​ లోన్​ తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పెళ్లి నుంచి ఫారిన్​ ట్రిప్​ వరకు, ఇంటి మరమ్మత్తుల నుంచి అత్యవసర వైద్య ఖర్చుల వరకు అందరు ఈ లోన్​ని ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, ఇప్పటికీ చాలా మందికి పర్సనల్​ లోన్​ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను తొలగించి, వాస్తవాలను స్పష్టం చేసి, మీ రుణ నిర్ణయంలో మీకు ఆత్మవిశ్వాసం కలిగించే ప్రయత్నం ఇక్కడ చేద్దాము..

1. పర్సనల్ లోన్‌లు కేవలం అత్యవసరాల కోసమే..

రుణాలు తీసుకునే చాలా మంది పర్సనల్ లోన్‌లను కేవలం అత్యవసరాల కోసం మాత్రమే అని భావిస్తారు! కానీ ఆధునిక రుణ వ్యవస్థ.. విద్య ఖర్చులు, సెలవులు, ఇంటి పునరుద్ధరణ, అధిక వడ్డీ ఉన్న రుణాలను ఏకీకరణ చేయడం వంటి అనేక ప్రయోజనాలకు పర్సనల్ లోన్‌లను అందిస్తుంది.

2. మీకు క్రమం తప్పకుండా ఉద్యోగం, మంచి క్రెడిట్ స్కోర్ అవసర...