భారతదేశం, నవంబర్ 9 -- 'పర్సనల్​ లోన్​ ఈఎంఐని ఒక్కసారి మిస్​ చేస్తే ఏమవుతుందిలే' అని మీరు అనుకోవచ్చు. అయితే, ఇది మీ క్రెడిట్ హెల్త్​, భవిష్యత్తులో రుణాలు పొందే సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిణామాలకు దారితీస్తుందని మీరు తెలుసుకోవాలి.

తెలివైన రుణగ్రహీతలు ఎప్పుడూ తమ చెల్లింపు తేదీలను లేదా బకాయిలను కోల్పోకుండా చూసుకోవాలి. వారి క్రెడిట్ ప్రొఫైల్ నమ్మదగినదిగా, పారదర్శకంగా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం.

పర్సనల్​ లోన్​ ఈఎంఐని మిస్ అవ్వడం అనేది రుణగ్రహీత ఆర్థిక బలహీనత, ప్రణాళిక లేమి, పేలవమైన నిర్వహణను సూచిస్తుంది. ఇది రుణం ఇచ్చిన సంస్థ దృష్టిలో పెద్ద ప్రతికూల అంశం. ఈ నేపథ్యంలో పర్సనల్​ లోన్​ ఈఎంఐ మిస్​ అయితే ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

ఒక ఈఎంఐని కట్టకపోయినా, రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌లో 50 నుంచి 70 పాయింట్ల వరకు తక్షణ పతనం సంభవించవచ...