Andhrapradesh, జూలై 12 -- శ్రీశైలం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ సంభవించింది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రద్దీ మరీ ఎక్కువైంది. పాతాళగంగా నుంచి దోమలపెంట చెక్ పోస్టు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఘాట్ రోడ్డులోనే కాకుండా. శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండటంతో పాటు నల్లమల అందాలను వీక్షించేందుకు. పర్యాటకలు ఎక్కువగానే తరలివచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీకెండ్స్ లేదా సెలవు దినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హ...