భారతదేశం, జూలై 10 -- బెంగళూరుకు చెందిన ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నడిపే వ్యక్తి.. బహిరంగ ప్రదేశాల్లో మహిళల వీడియోలను వారి అనుమతి తీస్తున్నాడు. మహిళకు నడిచే వీడియోలు ఇన్‌స్టా పేజీలో అప్‌లోడ్ చేస్తున్నాడు. ట్రావెల్ అండ్ స్ట్రీట్ ఫ్యాషన్ అనే పేరుతో ఉన్న ఈ పేజీ లైఫ్‌స్టైల్ కంటెంట్ ముసుగులో మహిళలను అసభ్యకరంగా చూపిస్తుంది. ఇప్పుడు నెటిజన్ల నుండి విమర్శలను ఎదుర్కొంటోంది.

మహిళల అనుమతి లేకుండా వారి వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తున్న ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ఒక మహిళ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు. అనుమానితుడిని గుర్దీప్ సింగ్ అని గుర్తించారు. బెంగళూరులోని కెఆర్ పురం ప్రాంతంలోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

11,000 మందిక...