భారతదేశం, జనవరి 9 -- దక్షిణాది వెండితెరపై తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్న బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై మళ్లీ మెరవడానికి సిద్దమైంది సమంత. హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీనే 'మా ఇంటి బంగారం'.

తాజాగా ఇవాళ (జనవరి 9, శుక్రవారం) సమంత మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ టీజర్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇందులో సమంత లుక్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. ఆమె తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మా ఇంటి బంగారం టీజర్ ప్రారంభంలో సమంత తన భర్తతో కలిసి అత్తవారింట్లో అడుగుపెడుతుంది. అంతా బాగున్నారని సమంత అంటే అసలైన ఎంక్వైరీ మొదలవుతుందని భర్త అంటాడు. "వారంలో అందరినీ నా దారిలోకి తెచ్చుకుంటాను" అని భర్తకు సమంత చెబు...