భారతదేశం, జనవరి 13 -- 2026 జనవరి 13 నుండి 15 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో 'ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్' సందర్భంగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు ప్రయాణికులు పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఉన్న రోడ్లపైకి వెళ్లకుండా ఉండాలని సూచించారు. మంగళవారం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి.

పరేడ్ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆక్షలు విధిస్తున్నట్లు ప్రకటనలో పోలీసులు వెల్లడించారు. పలు రూట్లలో ట్రాఫిక్ మళ్లిస్తారు. మరికొన్ని రూట్లను క్లోజ్ చేస్తారు. ట్రాఫిక్ రద్దీని బట్టి సీటీఓ ఎక్స్ రోడ్, ప్లాజా ఎక్స్ రోడ్లు,...