Hyderabad, మే 14 -- మెత్తటి పరుపుల్లో పడుకోవడం ఇప్పుడు చాలా మందికి అలవాటు అయిపోయింది. పరుపు లేనిదే నిద్ర పట్టదు అనే వారు కూడా ఇప్పుుడ చాలా మంది ఉన్నాయి. నిజానికి పరుపులో పడుకోవడం సుఖంగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. కానీ ఈ సుఖం, హాయి మీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తున్నాయో మీకు తెలుసా? పరుపు మీద పడుకుంటేనే నిద్ర పట్టే అలవాటు కారణంగా మీరు ఏమేం కోల్పోతున్నారో మీకు ఎవరైనా చెప్పారా? ఇప్పటి వరకూ లేకపోతే ఇప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి. నేల మీద పడుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుని మీ ఆరగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.

వాస్తవానికి నేలమీద నిద్రించడం చాలా మంచిదని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. పూర్వకాలంలో ఎక్కువ మంది నేల మీదనే నిద్రించేవారు. ఈ అలవాటు ఉన్నవారు ఇప్పటికీ మెత్తటి పరుపుల మీద నిద్రించడానికి ఇష్టపడరు. ముఖ్యంగా వేసవిలో పరుపు చాలా...